విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ఇక ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో భక్తి గీతం విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. ‘శ్రీ కాళ హస్తి’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఇందులో విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా నటించడం విశేషం.
కాగా కన్నప్ప చిత్రంలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























