టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. ఆయన భార్య రహస్య గురువారం రాత్రి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ మేరకు విషయాన్ని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా బాబు ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నాడు. ఈ ఫొటోలో తనయుడి లేలేత పాదాన్ని ముద్దాడుతున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘రాజాగారు రాణివారు’ సినిమా షూటింగ్ సమయంలో రహస్య, కిరణ్‌ల మధ్య ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది వీరు వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులు తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఇక కిరణ్ తండ్రైన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు మరియు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























