హరి హర వీరమల్లు థర్డ్ సింగిల్ రెస్పాన్స్ అదిరింది

Hari Hara Veera Mallu third single gets sensational views

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ హరి హర వీరమల్లుతో రానున్నాడని తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అందులో భాగంగా నిన్న ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అసుర హననం అంటూ సాగే ఈసాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా 24 గంటల్లో ఓవరాల్ గా 35 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు.ఇందులో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తున్నారు.జూన్ 12న హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

ఇక పవన్ ప్రస్తుతం ఓజీ పూర్తి చేసే పనిలో వున్నాడు.రీసెంట్ గానే ఓ షెడ్యూల్ కంప్లీట్ కాగా రేపటి నుండి ముంబై లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. పవన్ శనివారం నుండి ఇందులో జాయిన్ కానున్నాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.తమన్ సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.