నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కుబేర’ ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మరోసారి స్పష్టం చేశారు మేకర్స్. ఈ మేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల క్యారెక్టర్ బేస్డ్ నేరేటివ్స్ తో అదరగొట్టే నెవర్ బిఫోర్‌గా తీర్చిదిద్దారు. మొత్తానికి కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవనుందని టీమ్ పేర్కొంది.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల హోం బ్యానర్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























