రీసెంట్ గా మలయాళం నుండి తుడరుమ్ కోలీవుడ్ నుండి టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలై ఈ రెండు ఈఏడాది బిగ్గెస్ట్ హిట్లుగా రికార్డులను సాధించాయి. ఇందులో తుడరుమ్ గత నెలలో విడుదలై ఒక్క కేరళ లోనే 110 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా చూస్తే 230 కోట్ల పైనే వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇప్పటికీ రోజుకి కోటి రూపాయలకు తగ్గకుండా వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఇక ఈసినిమా ఒప్పందం ప్రకారం మే 21నే ఓటిటి లోకి రావాల్సి వుంది. హాట్ స్టార్ట్ ఈ హక్కులను దక్కించుకుంది. అయితే థియేట్రికల్ రన్ అదరగొడుతుండడంతో మేకర్స్ రిక్వెస్ట్ మేరకు వచ్చే వారం చివరి వరకు వాయిదా పడింది. ఆలెక్కనా వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ లోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిన్న సినిమాగా వచ్చి రికార్డు కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ నెల 1న విడుదలైన ఈసినిమా నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.ఒక్క తమిళనాడు లోనే 50కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా ఈనెల 28న లో స్ట్రీమింగ్ లోకి రావాల్సివుంది.
ఈసినిమా ఓటిటి హక్కులను కూడా హాట్ స్టారే సొంతం చేసుకుంది.అయితే థియేటర్లలో ఇంకా సాలిడ్ వసూళ్లను రాబడతుండడంతో మేకర్స్ రిక్వెస్ట్ మేరకు ఈసినిమా ఓటిటి రిలీజ్ కూడా వాయిదా పడింది.దాంతో వచ్చే నెల 6న స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఈసినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























