సినీ ప్రియులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదాపడింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో షేరింగ్ విధానం సహా ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సినిమాల వసూళ్లకు సంబంధించి పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అద్దె ప్రాతిపదికన చిత్రాలను ప్రదర్శించడం వల్ల నష్టాలొస్తున్నాయని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు జూన్ 1 నుంచి బంద్ నిర్వహించాలని తొలుత భావించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మరియు నిర్మాతలతో ఈ సమావేశం ఏర్పాటుచేసింది.
ఈ క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఈ అంశంపై ఉదయం 11 గంటల నుంచి వాడి వేడి చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలలోని దాదాపు 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. అలాగే సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్‌తో సమావేశమైంది తెలుగు ఫిలిం ఛాంబర్. ఇక డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేయడం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేయడం జరిగాయి. అయితే ఈ రెండు విషయాల్లోనూ సరైన సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే పైరసీ, ఐపిఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎగ్జిబిటర్లను కోరారు. దీంతో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం ఈ నెల 23న మరోసారి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























