నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హ్యుజ్ బజ్, ట్రెమండస్ బుకింగ్స్ తో మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఇది ఒక అద్భుతమైన రిలీజ్ డే. పొద్దున లేచి చూస్తే నా ఫోను మెసేజ్లతో నిండిపోయింది. ఇండస్ట్రీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సినిమా గురించి అద్భుతంగా చెబుతున్నారు. చాలా రిలీజ్ డేస్ చూసాను. కానీ ఈ రిలీజ్ డేట్ వైబ్ అదిరిపోయింది. సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి.. సినిమా సూపర్ హిట్.. ఇవన్నీ పక్కన పెడితే ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ హిట్ 3 జర్నీ.. ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది.”
“ఇది ఎక్కడికెళ్లి ల్యాండ్ అవుతుందనేది మా టీం అంచనాలకి అందడం లేదు. అందుకే ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వదల్చుకోలేదు. మీ అందరి ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఇప్పుడిప్పుడే ఆగదు. ఈ సినిమాకి కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతిసారి నాకు ఒక నమ్మకం ఉంటుంది.”
“నేను, మీరు ఒకటేనని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. సినిమాని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ సో మచ్. మీ సపోర్ట్ వలనే ఈ బ్లాక్ బస్టర్ సాధ్యమైంది. మే ఫస్ట్ స్టార్ట్ అయింది. మే అంతా ఇది సెలబ్రేషన్స్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రికి అమెరికా వెళుతున్నాను. నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను. వచ్చిన వెంటనే మీ అందరిని కలుసుకొని గ్రాండ్ గా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం.”
“శైలేష్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇది తన విజన్ కి ఒక టీజర్, ట్రైలర్ మాత్రమే. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే దిల్ రాజు గారికి థాంక్యూ సో మచ్. టికెట్ విషయంలో సపోర్ట్ చేసిన ఏపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కృతజ్ఞతలు. ఇది తెలుగు సినిమా సక్సెస్. రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరు ప్రతి సినిమాని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























