హిట్ 3 సక్సెస్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది

Producer Dil Raju Says, Tollywood Breathed With Huge Success of HIT 3

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హ్యుజ్ బజ్, ట్రెమండస్ బుకింగ్స్ తో మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. “నిర్మాత.. మే1న మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీసుకుంది. లాస్ట్ మంత్ అంతా సినిమాలో వస్తున్నాయి కానీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు, సమ్మర్ అయిపోతుంది అనుకుంటున్న తరుణం. ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక చాలా సింగిల్ స్క్రీన్స్ ఏపీ తెలంగాణలో క్లోజ్ చేయడం కూడా జరిగింది.”

“ఇలాంటి సమయంలో మా హోప్స్ అన్నీ కూడా హిట్ 3 సినిమా మీదే ఉన్నాయి. ఆడియన్స్ సినిమాకి ఏ రేంజ్ లో ఫుల్స్ ఇస్తారని బ్రీతింగ్ హోల్డ్ చేసుకుని ఉన్నాము. అలాంటిది ఈ సినిమాకి మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చూసి జనాలు థియేటర్స్ కి వస్తున్నారని హ్యాపీగా ఫీలయ్యా. ఈ సినిమాకి ఎక్కడ చూసినా యునానమస్ గా లాస్ట్ హాఫ్ అండ్ అవర్ ఎక్స్ట్రార్డినరీ అనే మాట వినిపిస్తుంది.”

“సినిమా అయితే అదిరిపోయింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ట్రెమండస్ ఓపెనింగ్స్ వచ్చాయి. నానికి ఓవర్సీస్ దసరా హైయెస్ట్ ఉండే ఈ సినిమా క్రాస్ చేసింది. నానికి అక్కడ ఓవర్సీస్ హైయెస్ట్ గ్రాఫర్ అయ్యింది. అలాగే తెలంగాణలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నానికి డే వన్ కలెక్షన్ హైయెస్ట్ కాబోతుంది. నాని థాంక్యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ గా సూపర్ హిట్ ఇచ్చావు.”

“అలాగే ఈరోజు ప్రొడ్యూసర్ కం హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు. శైలేష్ నాని కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ కంగ్రాట్యులేషన్స్. ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే చూడ్డానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్లీ మాకు ఎనర్జీ ఇచ్చారు. డెఫినెట్గ మా వంతు కూడా బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మీకు కొత్త సినిమాలు ఇచ్చి మీ మిమల్ని థియేటర్స్ కి తీసుకు రావడానికి ఆలోచిస్తున్నాము. అందరికీ థాంక్యు వెరీ మచ్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.