SVC 60, ఆశిష్ మూవీ టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ రిలీజ్

SVC 60, Hero Ashish Film Titled DeThadi and First Look Unveiled

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్‌ తమ ప్రైడ్ ప్రాజెక్ట్ #SVC60 ను ఇటీవల ప్రకటించారు. ‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్ తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్‌కు నచ్చే స్టైల్లో ‘దేత్తడి’ అనే టైటిల్ పెట్టారు.

ఇది హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రామిస్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భుజాలపై డప్పు తగిలించుకుని రెండు స్టిక్స్‌తో బలంగా మోగిస్తుండగా, మూడో స్టిక్‌ను పళ్ల మధ్యలో పట్టుకుని, అతని ముఖం మొత్తం జోష్‌తో నిండిపోయి ఉంది.

ఆశిష్ దుస్తులు కూడా అతని క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేస్తూ మాస్ ఫీల్‌ను ఇస్తున్నాయి. బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సినిమాకు ఎంత ఎనర్జీగా ఉంటుందో సూచిస్తోంది. ఈ సినిమాలో మాస్ మేకోవర్‌లో కనిపించనున్న ఆశిష్, హైదరాబాదీ స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమాకు మరో హైలైట్ కానుంది.

ఈ సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలవనుంది. దర్శకుడు స్వయంగా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో సినిమాలో సౌండింగ్ ఇన్నోవేటివ్ గా ఉండబోతుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ చిత్రం మరికొన్నిరోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ఇందులో నటించనున్న ఇతర నటీ,నటులు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.