రివ్యూ – హిట్: ది థర్డ్ కేస్

Hit: The 3rd Case Telugu Movie Review

నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, ఆదిల్ పాలా తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్ర‌ఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాణం: వాల్ పోస్టర్ సినిమా, యూనిమస్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని
దర్శకత్వం: శైలేష్ కొలను

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. హిట్ యూనివర్స్‌లో భాగంగా మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన మోస్ట్ టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్‌ అర్జున్ సర్కార్‌గా నటించాడు. నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ట్రైలర్ సహా అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య హిట్ 3 నేడు పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలో విడుదలైంది. అయితే హిట్ యూనివర్స్‌లోని గత రెండు చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించిందా? క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా నాని నటన ఎలావుంది? కెరీర్‌లో తొలిసారిగా ఇలాంటి పాత్రలో కనిపించిన ఆయన ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడా? శ్రీనిధి శెట్టి గ్లామర్ సినిమాకి ఏ మేరకు హెల్ప్ అయింది? శైలేష్ కొలను మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించాడా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

అర్జున్ సర్కార్ (నాని) వైజాగ్ హిట్ టీమ్‌లో ఎస్.పి.గా పనిచేస్తుంటాడు. తన విధి నిర్వహణలో భాగంగా వేర్వేరు ప్రదేశాలలో ఒకేలా జరిగిన హత్యలను గమనిస్తాడు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 13 హత్యలు జరిగిన విధానం అర్జున్ సర్కార్ ను ఆలోచనలో పడేస్తుంది. దీంతో ఈ హత్యల వెనకున్న నిజాన్ని వెలికితీసేందుకు తన టీమ్ మెంబర్స్ వర్ష (కోమలి ప్రసాద్), దివాకర్ (చైతు జొన్నలగడ్డ) లతో కలిసి ఈ ఆపరేషన్ ను పై అధికారి నాగేశ్వరరావు (రావు రమేశ్‌) అనుమతితో టేకప్ చేస్తాడు. ఇక్కడినుండి కథ శ్రీనగర్ నుండి బీహార్>> అక్కడినుండి అరుణాచల్ ప్రదేశ్‌ వరకు సాగుతుంది.

అయితే అర్జున్ సర్కార్ ఈ సీరియల్ క్రైమ్స్‌ని అడ్డుకోగలిగాడా? దీని వెనకున్న కిల్లర్స్ గ్యాంగ్‌ని పట్టుకోగలిగాడా? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని అతను ఎలా అధిగమించాడు? మృదుల (శ్రీనిధి శెట్టి) ఎవరు? ఆమెతో అర్జున్ సర్కార్ ప్రేమాయణం ఏమైంది? అసలు అతను క్రిమినల్స్ పట్ల ఎందుకంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతుంటాడు? ఈ మూవీ సీక్వెల్ హిట్ 4కి సంబంధించి చివరిలో ఏమైనా లీడ్ ఇచ్చారా? క్లైమాక్స్‌లో వచ్చే సర్‌ప్రైజ్ ఏంటి? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:-

కథగా చూస్తే.. హిట్ 3 మనం రెగ్యులర్‌గా చూసే ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ వంటిదే. అయితే ఇలాంటి కథలకి ట్రీట్మెంటే కీలకం. డైరెక్టర్ శైలేష్ కొలను ఇక్కడే తన ట్యాలెంట్ ఏంటో చూపించాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు కథలో బలమైన భావోద్వేగాలకు పెద్దపీట వేశాడు. ప్రేక్షకుడు దీనికి వెంటనే కనెక్ట్ అవుతాడు. వైలెన్స్ మితిమీరి ఉందనిపించినప్పటికీ అది ఎక్కడా సినిమాకి నెగటివ్ అవ్వదు. అలాంటి క్రిమినల్స్‌ని ఇలాగే డీల్ చేయాలి అనిపించేలా ఉంటుంది. హీరో క్యారక్టరైజేషన్ దీనిని జస్టిఫై చేస్తుంది.

సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడిని నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. కాశ్మీర్‌లో సీరియల్ మర్డర్స్, ఈ నేపథ్యంలో హీరో అక్కడ ఛార్జ్ తీసుకోవడం, తన స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం, మరోవైపు విలన్ గ్యాంగ్ అకృత్యాలతో ఫస్టాఫ్ అంతా ఫాస్ట్‌గా సాగుతుంది. అలాగే మరోవైపు హీరోయిన్‌తో పరిచయం, ప్రేమలో పడటం, వీరి మధ్య డ్యూయెట్స్.. ఇలా ఈ లవ్ ట్రాక్ కూడా సైమల్టేనియస్‌గా జరుగుతుంటుంది. ఒక అదిరిపోయే ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. దీంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది.

దీనికి తగ్గట్టే స్టోరీ అనూహ్య మలుపులతో ఉత్కంఠకు గురిచేస్తుంది. విలన్ గ్యాంగ్‌తో హీరో ముఖాముఖీ తలపడటం, కేసులో ఇన్వాల్వ్ అయినవారిని ఒక్కొక్కరినీ వెతికిమరీ హతమార్చడం, ఈ క్రమంలో వచ్చే ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. ముఖ్యంగా చివరి 30 నిముషాలు అయితే గుజ్ బంప్స్ వచ్చేలా ఉంటాయి. ఇక క్లైమాక్స్‌లో ఒక స్టార్ హీరో క్యామియో రోల్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేస్తాడు. ఈ సీన్ అయితే విజిల్స్ వేయించేలా వుంటుంది. ఇది సీక్వెల్ హిట్ 4కి లీడ్‌లా వుంటుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. నాని ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఇప్పటికే అనేక సినిమాల్లో తన సహజమైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఎక్కువగా సాఫ్ట్ నేచర్ ఉన్న పాత్రలలో కనిపించే నాని అడపాదడపా మాస్ క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. ఇంతకుముందు వచ్చిన ‘దసరా’ ఆయనకు సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పడు మరోసారి అంతకుమించి అనేలా క్రూరమైన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నాని నటన అనన్యసామాన్యం. అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన చెలరేగిపోయాడనే చెప్పొచ్చు.

అలాగే నటి శ్రీనిధి శెట్టి పాత్ర, తను నటించిన తీరు మెప్పిస్తుంది. స్క్రీన్ పైన ఆమె చాలా అందంగా కనిపించింది. సాధారణంగా ఇలాంటి సినిమాలలో హీరోయిన్ పాత్ర నామమాత్రంగానే వుంటుంది. అయితే అందుకు విరుద్ధంగా కథానాయిక పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్సే వుంటుంది. సాంగ్స్‌కే పరిమితమవకుండా కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా వుంటుంది. రావు రమేష్, బ్రహ్మాజీ సహా మిగతా నటులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక టెక్నికల్ పరంగా చూస్తే హిట్ 3 హై స్టాండర్డ్స్‌లో ఉంది. మిక్కీ జె. మేయర్ సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇలాంటి కథలకు బీజీఎమ్ ఎంత ముఖ్యమో తెలిసిందే. దానికి అనుగుణంగానే మిక్కీ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. కొన్ని సీన్స్‌లో అయితే బీజీఎమ్ గూజ్ బంప్స్ తెప్పించేలావుంది. చాలా సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది. అలాగే సాంగ్స్ లోనూ మిక్కీ జె. మేయర్ మ్యాజిక్ కనిపిస్తుంది.

డీఓపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్ర‌ఫీ మూవీకి మరో ఎస్సెట్. ఆయన కెమెరా కాశ్మీర్ అందాలను చక్కగా ఒడిసిపట్టింది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా ఉంది. అలాగే కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. దీనివలన మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా పరుగెత్తుతున్నట్టు ఉంటుంది. ఇంకా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. హీరోనే నిర్మాతల్లో ఒకరు కావడంతో స్టోరీ డిమాండ్ మేరకు నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి రాజీపడలేదని అర్ధమవుతుంది.

హిట్ 3 సినిమా కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో సాగిపోయే క్రైం థ్రిల్లర్. సీరియస్ టైప్ కథనంతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేసే డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ, డైలాగ్స్, క్యారెక్టర్స్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అయితే ఇది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే కాకుండా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సహా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది. ఈ సినిమాతో నానికి సాలిడ్ హిట్ పడ్డట్టే అని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.