రెట్రో కోసం విజయ్ దేవరకొండ

Vijay Deverakonda To Attend as Chief Guest For Retro Pre-Release Event

వెర్సటైల్ స్టార్ సూర్య ‘కంగువా’ తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రెట్రో’. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్‌ టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా రేపు రెట్రో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

కాగా ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సంస్థ నిర్మిస్తోన్న ‘కింగ్ డమ్’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సూర్య తన నెక్స్ట్ ఫిల్మ్ సితార లోనే చేస్తుండటం గమనార్హం.

శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ విజువల్ గ్రాండియర్‌ను అందించనుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ ని ఎలివేట్ చేయనుంది. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.