తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ (GTFA)ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది. ఈ జ్యూరీలో మొత్తం 15 మందితో కూడిన నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఖరారుచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (GTFA) యొక్క కర్టెన్ రైజర్ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు TFDC ఛైర్మన్ దిల్ రాజు సహా జ్యూరీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి జయ సుధ జ్యూరీ చైర్‌పర్సన్‌గా ప్రకటించగా.. జ్యూరీ సభ్యులను అధికారికంగా పరిచయం చేశారు.
ఇక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 14న హైటెక్స్‌లో (HICC)లో జరుగనుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. 2014 నుండి 2023 వరకు ఉన్న పది సంవత్సరాల కాలానికిగానూ ప్రతి ఏడాది ఒక చిత్రానికి అవార్డు లభించనుంది.
ఇక జ్యూరీ సభ్యులు ప్రస్తుతం గద్దర్ అవార్డుల కోసం వివిధ క్యాటగిరీలలో ఎంట్రీలకు వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన సినిమా ప్రదర్శనలు నేటినుంచి ప్రారంభమవుతాయి. ఈ అవార్డ్స్‌కి అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందగా.. వీటిలో వ్యక్తిగత క్యాటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు వంటి వివిధ క్యాటగిరీలలో 76 దరఖాస్తులు వచ్చాయి.
ప్రముఖుల పేర్లతో అందజేయనున్న ప్రత్యేక గౌరవ అవార్డులు
- NTR జాతీయ చలనచిత్ర అవార్డు
- పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డ్
- బి.ఎన్. రెడ్డి ఫిల్మ్ అవార్డ్
- నాగి రెడ్డి & చక్రపాణి ఫిల్మ్ అవార్డ్
- కాంతారావు ఫిల్మ్ అవార్డ్
- రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























