పుష్ప 2 తరువాత హిందీలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది బాలీవుడ్ సినిమా ఛావా.ఫిబ్రవరి లో విడుదలైన ఈసినిమా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈసినిమా కొంచెం ఆలస్యంగా తెలుగులోకూడా విడుదలకాగా దాదాపు 10కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకొని సూపర్ హిట్ అనిపించుకుంది. గీతా ఆర్ట్స్ ఛావా ను తెలుగులో విడుదలచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఈరోజు రాత్రి 12 గంటలనుండి స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది నెట్ ఫ్లిక్స్.అయితే కేవలం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.మరి మిగితా భాషల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి వస్తుందో క్లారిటీ రావాల్సివుంది.
చారిత్రాత్మక నేపథ్యంలో మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో యంగ్ హీరో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా నటించగా రష్మిక మందన్న యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.దినేష్ విజన్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























