బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన సినిమా జాట్. మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి.ట్రైలర్ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది దాంతో సినిమాపై బజ్ వచ్చింది.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.కేవలం హిందీలోనే రిలీజ్ కాగా ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా బాగుందని సన్నీ డియోల్ ను ఇంతకుముందెన్నడూ ఈ విధంగా ఎవరు చూపించలేదని గోపిచంద్ మలినేని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అలాగే విలన్ పాత్రలో రణదీప్ హూడా అదరగొట్టాడని తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అనే టాక్ తెచ్చుకుంటుంది.ముఖ్యంగా సన్నీ డియోల్ ఫాన్స్ కు జాట్ బాగా నచ్చుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.ఓవరాల్ గా జాట్ తో గోపిచంద్ మలినేని అలాగే పీపుల్ మీడియా ,మైత్రి మూవీ మేకర్స్ హిందీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.మరి హిందీలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈసినిమాను తెలుగులోకూడా రిలీజ్ చేస్తారో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: