టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇటీవలే విడుదలచేసిన ఫస్ట్ సింగిల్ కూడా అలరించింది. ‘టచ్ కియా’ అంటూ సాగే ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో బాలీవుడ్ బ్యూటీ, ‘డాకు మహారాజ్’ ఫేమ్ ఊర్వశి రౌటేలా ఈ పాటలో తన డ్యాన్స్ అండ్ గ్రేస్‌తో అదరగొట్టింది.
ఇదేక్రమంలో నిన్న శ్రీరామ నవమి సందర్భంగా జాట్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పక్కా డివోషనల్ జానర్ లో తెరకెక్కిన ఈ సాంగ్‌కి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. అద్వితీయ వొజ్జల, శృతి రంజని రచించగా.. ధనుంజయ్ సీపాన, సాకేత్ కొమ్మజోస్యుల, సుమనస్ కాసుల, సాత్విక్ జి రావు, వాగ్దేవి కుమార తదితరులు శ్రావ్యంగా ఆలపించారు.
కాగా ఈ సినిమాకి రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























