మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 రానుందని తెలిసిందే.ఉగాది రోజున ఈసినిమా లాంఛ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా టీం ను తన దైన స్టయిల్లో చిరుకి పరిచయం చేశాడు అనిల్ రావిపూడి.డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ,ఎడిటర్ ,సినిమాటోగ్రఫర్ ,నిర్మాతలను చిరు పరిచయం చేసుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతికి వస్తున్నాం టెక్నీషియన్స్ నే ఈసినిమాకు రిపీట్ చేస్తున్నాడు అనిల్.అందులో భాగంగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ,తమ్మిరాజు ఎడిటింగ్ అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ,షైన్ స్క్రీన్ బ్యానర్ల పై చిరంజీవి పెద్ద కూతరు సుష్మిత కొణిదెల , సాహు గారపాటి నిర్మిస్తున్నారు.వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
జూన్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లి ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేయనున్నారు.డిసెంబర్ లోగా ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు.చిరుకి తోడు సంక్రాంతికి వస్తున్నాం తరువాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమా కావడంతో మెగా 157పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ప్రస్తుతం చిరంజీవి, విశ్వంభరను పూర్తి చేసే పనిలో వున్నాడు.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.జూలై లేదా ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























