గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో రానున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి చరణ్ పోస్టర్లను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఈనెల 6న శ్రీ రామనవమి ఈ సందర్బంగా ఈ గ్లింప్స్ రానుంది.ఈవీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచనుంది.ఇందులో పెద్దిని పరిచయం చేయనున్నారు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.సెప్టెంబర్ లోగా సినిమా కంప్లీట్ కానుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.టీ సిరీస్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమాను పూర్తి చేసిన తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.అయితే సుకుమార్ తో సినిమా చాలా ఆలస్యంగా మొదలుకానుందాట.దాంతో ఈ గ్యాప్ లో చరణ్ మరో సినిమా చేయాలని చూస్తున్నాడని సమాచారం.త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























