బాక్సాఫీస్ వద్ద కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అదరగొడుతుంది.గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.నిన్న మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 24.4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఆల్రెడీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాగా ఇప్పటివరకు 5కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరాలనే వుంది.అదే జరిగితే కోర్ట్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి గా నిలువనుంది.కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం తో ఫుల్ రన్ లో బయ్యర్లకు ఊహించని లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బుక్ మై షో లో నిన్నటి వరకు ఈసినిమాకు 4లక్షల పైగా టికెట్స్ తెగాయి.ఇక ఈసినిమా అటు ఓవర్సీస్ లోనూ హిట్ అనిపించుకుని బ్లాక్ బస్టర్ గా దిశగా సాగుతుంది. నిన్నటి వరకు 600K డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈవారంలో వన్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.
నేచురల్ స్టార్ నాని ఈసినిమా ను నిర్మించగా తన బ్యానర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటిలో కోర్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలువనుంది. ఈసినిమాను నాని గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు. రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేయడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది.మరో 10రోజుల వరకు ఎటువంటి పోటీ లేకపోవడం తో కోర్ట్ డ్రీం రన్ ను కొనసాగించనుంది.
పోక్సో యాక్ట్ నేపథ్యంలో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























