నాని గారు అలా చెప్పగానే షాకయ్యాం

Producers Prashanti Tipirneni and Deepthi Ganta Reveals Interesting Facts About COURT Movie

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, అలానే ‘ప్రేమలో’ సాంగ్ కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఇక తాజాగా బుధవారం రాత్రి వేసిన ప్రిమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరుల సమావేశం నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు.

దీప్తి గారు కోర్ట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

  • నాని, ప్రశాంతి గారు స్క్రిప్ట్ విని ఓకే చేశారు.
  • నేను ఆన్‌సెట్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాను.
  • నేను రోజూ సెట్స్‌లో వుండేదాన్ని.
  • నాని, ప్రశాంతి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.

కథ విన్నాక మీకు ఎలా అనిపించింది?

  • నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను.
  • డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు.
  • చాలా లేయర్స్ వున్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు.
  • స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది.

ప్రశాంతి గారు వాల్ పోస్టర్ సినిమాలో కథ ఓకే అవ్వడం ఎలా వుంటుంది?

  • నాని, నేను ఇద్దరం కథ వింటాం.
  • అయితే మా నమ్మకం అంతా నాని గారి జడ్జిమెంట్ మీదే వుంటుంది.
  • ఆన పెద్దగా లెక్కలేమీ వేయరు.
  • ఒక కథ థియేటర్‌లో చూడాలనిపించేలా వుంటే ఓకే చేస్తారు.

ప్రశాంతి గారు ప్రీమియర్స్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

  • ప్రీమియర్స్‌కి యునానిమస్‌గా ఎక్స్‌లెంట్ రెస్పాన్స్ వచ్చింది.
  • ఫస్ట్ హాఫ్ చూసి ‘వావ్’ అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు.
  • సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్‌కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది.
  • మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
  • ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది.
  • ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం.
  • ప్రీమియర్స్‌కి కొందరు లాయర్స్ కూడా వచ్చారు. వారికి చాలా నచ్చింది.
  • ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఇంత నేచురల్‌గా ప్రజెంట్ చేయడం ఇంతముందు చూడలేదని చెప్పారు.
  • ఇది మాకు మంచి కాంప్లిమెంట్.

దీప్తి గారు.. మీకు ఇందులో నచ్చిన పాయింట్స్ ఏమిటి?

  • చాలా పాయింట్స్ వున్నాయి.
  • రోహిణి గారి క్యారెక్టర్‌తో వచ్చే ఓ సీన్ చాలా నచ్చింది.
  • అలాగే మంగపతి క్యారెక్టర్‌లో శివాజీ గారు అద్భుతంగా చేశారు.
  • ప్రతి ఇంట్లో అలాంటి ఓ క్యారెక్టర్ వుంటుంది.

డైరెక్టర్ జగదీశ్ గురించి?

  • డైరెక్టర్ జగదీశ్ ఈ సినిమాని చాలా రీసెర్చ్ చేసి రాశాడు.
  • అందుకే సినిమా చాలా నేచురల్‌గా వచ్చింది.
  • పోక్సో చట్టం గురించి ఆయన చాలా డీటెయిల్డ్‌గా ప్రజెంట్ చేశాడు.

హిట్ 3 స్టేక్స్ చాలా పెద్దవి.. కానీ నాని గారు కోర్ట్ నచ్చకపొతే హిట్ 3 చూడొద్దని చెప్పడం ఎలా అనిపించింది?

  • మాకు షాకే. నేను, ప్రశాంతి వెంటనే డైరెక్టర్ శైలేష్ వంక చూశాం (నవ్వుతూ).
  • తనకి నమ్మకం వుంది కాబట్టే ఆ మాటని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

ఈ సినిమా కోసం ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు?

  • సెట్స్ పరంగా ఎక్కువ స్పెండ్ చేయలేదు కానీ ఈ కథకు మంచి యాక్టర్స్ కావాలి.
  • ఆ విషయంలో రాజీ పడలేదు.
  • ప్రియదర్శితో పాటు రోహిణీ గారు, సాయి కుమార్ గారు, శివాజీ గారు, హర్ష వర్ధన్ గారు.. ఇలా మంచి యాక్టర్స్ వున్నారు.
  • రోషన్, శ్రీదేవి కూడా వారి పాత్రలకు పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు.

ప్రశాంతి గారు.. మీ కథల ఎంపిక ఎలా వుంటుంది?

  • జానర్ ఏదైనా కథలో నిజాయితీ వుండాలి.
  • కథలో హానెస్టీ, డైరెక్టర్‌లో క్లారిటీ వుంటే ముందుకు వెళ్తాం. నాని గారు ఇదే చూస్తారు.

దీప్తి గారు మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?

  • నేను ‘మీట్ క్యూట్’ చేసిన తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చాను.
  • కొన్ని ఐడియాలు వున్నాయి. వాటిని స్క్రిప్ట్‌గా డెవలప్ చేయాలి.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.