మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ కాంత అలాగే తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమాలు చేస్తున్నాడు.కాంతను తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుండగా రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇవి కాకుండా దుల్కర్ మరో సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడు.తన 40వ సినిమాను ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.ఈసినిమాకు ఐ యామ్ గేమ్ అనే టైటిల్ ను పెట్టారు.అలాగే ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చూస్తుంటే ఈసినిమా గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రానుందనిపిస్తుంది.ఆర్ డి ఎక్స్ డైరెక్టర్ నహస్ హిదాయత్ డైరెక్ట్ చేయనుండగా దుల్కర్ సల్మాన్ ,జామ్ వర్గీస్ నిర్మిస్తున్నారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దుల్కర్ సల్మాన్ .ఈసినిమాతో తను మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.అంతేకాదు తెలుగులో దుల్కర్, సీతారామం తరువాత వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























