కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ నిన్న ఈసినిమా తమిళ వెర్షన్ టీజర్‌ను రిలీజ్ చేశారు.ఇక ఈరోజు తెలుగు,హిందీ టీజర్లను కూడా రిలీజ్ చేశారు.ఈ టీజర్ ఆద్యంతం అభిమానులు కోరుకున్నట్టే హీరో ఎలివేషన్లతో, అజిత్ మార్క్ డైలాగ్స్‌తో సాగింది. దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కొన్ని సీన్స్‌లో అజిత్ యంగ్‌గా, మరికొన్ని సన్నివేశాల్లో ఎప్పటిలాగే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించి తన స్వాగ్‌తో అలరించారు.మొత్తానికి ఈ టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేలావుంది.
రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మార్క్ ఆంటోని’తో విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీని తీసుకువస్తున్నారు. అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆడియన్స్‌కు గ్రేట్ ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను రోమియో పిక్చర్స్ దక్కించుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ బడ్జెట్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: