టీఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన తర్వాత తొలిసారి బాలయ్యను కలిసిన దిల్ రాజు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించి దిల్ రాజు ఆధ్వర్యంలోని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో దిల్ రాజు కలిసిఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని మా నిర్మాత మరియు తెలంగాణ FDC చైర్మన్ శ్రీ #దిల్ రాజు గారు కలుసుకుని అభినందించారు! భారతీయ సినిమా మరియు సమాజానికి ఆయన చేసిన అపారమైన కృషికి తగిన గుర్తింపు. రాబోయే సంవత్సరాల్లో అతను విజయాన్ని కొనసాగించాలని మరియు మరెన్నో ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాము!” అని అందులో పేర్కొంది. కాగా ఇటీవలే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























