VD 14లో విలన్ గా హాలీవుడ్ నటుడు

Hollywood actor Arnold Vosloo is on board for VD 14

టాక్సీవాలా కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.అందులో భాగంగా రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ తన 14 వ సినిమాను చేయనున్నాడు.ఈసినిమాకు సంబంధించిన సెట్ వర్క్ నిన్న స్టార్ట్ చేశారు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. విజయ్ ఫామ్ ను పట్టించుకోకుండా మైత్రి ఈసినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టనుంది.అందుకు తగ్గట్లే ఈసినిమా కోసం హోలీవుడ్ యాక్టర్, ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ని తీసుకున్నారు.ఇందులో తను విలన్ గా కనిపించనున్నాడు.అలాగే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా తీసుకున్నారు.హిందీ సంగీత ద్వయం అజయ్- అతుల్ సంగీతం అందించనున్నారు.త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం విజయ్ తన 12న సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.ఈసినిమా ను పూర్తి చేసి విజయ్ 14వ సినిమాను మొదలు పెట్టనున్నాడు.

ఇక విజయ దేవరకొండ తన 13వ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలాతో చేయాల్సివుంది.ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.ఈసినిమా ఈఏడాది ద్వితీయార్థం లో సెట్స్ మీదకు వెళ్లనుంది.మరి ఈమూడు సినిమాలతో విజయ్ హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.