100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్

Netflix revealed this year telugu movie releases

బాలకృష్ణ డాకు మహారాజ్ 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా 4రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేసింది. ఈ వీకెండ్ కల్లా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.బుక్ మై షో లో 10లక్షలకుపైగా టికెట్స్ సేల్ అయ్యాయి.రేపు ఈసినిమా తమిళం లోకూడా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ ఇది వరుసగా 4వ 100కోట్ల సినిమా.అఖండ 2 తో మొదటి సారి ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా పాన్ ఇండియా రిలీజ్ లేకుండా వీరసింహ రెడ్డి , భగవంత్ కేసరి లతో 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హ్యాట్రిక్ విజయాలను సాధించాడు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ తో వరసగా నాలుగో విజయాన్ని అందుకున్నాడు.సంక్రాంతి సీజన్ ఈసినిమాకు అడ్వాంటేజ్ అయ్యింది.అయితే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం తో గట్టి పోటీ ఎదుర్కొంటుంది .

బాబీ తెరకెక్కించిన ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు.తమన్ సంగీతం అందించగా సాయి సౌజన్య , నాగవంశీ ఈసినిమాను నిర్మించారు.యాక్టన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ , తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.