విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఇప్పటివరకు ఇందులో నుండి మూడు పాటలు రిలీజ్ అవ్వగా సప్రైజింగ్ గా ఈ మూడు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.అందులో భాగంగా థర్డ్ సాంగ్ బ్లాక్ బస్టర్ పొంగల్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్ ని రెట్టింపు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండో సాంగ్ మీను 6వ స్థానంలో ఉండగా విడుదలైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో వున్న గోదారి గట్టు సాంగ్ 10వ స్థానంలో అదరగొడుతోంది.ఇప్పటివరకు ఈ మూడు పాటలకు కలిపి 85 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ సాంగ్స్ రీల్స్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.
ఇక సాంగ్స్ కు ఊహించని రెస్పాన్స్ వస్తుండడం తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.రీసెంట్ గా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్ లో మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.మొత్తానికి సాంగ్స్ కు తోడు డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తూ సినిమాకు కావాల్సిన బజ్ ను రాబట్టుకోవడంలో సంక్రాంతికి వస్తున్నాం టీం సక్సెస్ అయ్యింది.
ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈసినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























