ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ఈసినిమా తరువాత చేసిన జాతి రత్నాలు ,మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బ్లాక్ బాస్టర్ లు అయ్యాయి.అయితే సక్సెస్ వున్నా హడావిడి లేకుండా సైలెంట్ గా మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు ఈ హీరో.ఇక ఈఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈహీరో నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు.నిజానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సింది కానీ నవీన్ గాయపడడంతో ఆలస్యం అవుతుంది.రీసెంట్ గానే నవీన్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. హీరోయిన్ ను కూడా మార్చారు. మొదట శ్రీ లీలను తీసుకున్నారు.కారణాలు తెలియదు కానీ తరువాత ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు.ఈరోజు ఈసినిమా నుండి ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ ఓ వీడియో ను రిలీజ్ చేశారు.మూడు నిమిషాల పాటు సాగిన ఈ వీడియో ఫుల్ ఎంటర్టైనింగ్ గా వుంది.నవీన్ హాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు పలికిన విధానం ,ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ సూపర్ ఫన్ గా వుంది.చూస్తుంటే ఈసినిమా కూడా పక్కా హిట్ లాగే వుంది.
సినిమా ప్రొడక్షన్ కూడా చాలా క్వాలిటీగా వుంది.మారి డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో అనగనగా ఒక రాజు ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























