ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు – దిల్ రాజు

TFDC Chairman Dil Raju Reveals Key Points After Meeting With CM Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని టీఎఫ్‌డీసీ చైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖులు పలువురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను గురించి మీడియాకు వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపిన వివరాలు..

  • తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎంతో గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తున్నది.
  • ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి గ్యాప్ ఉందనేది కేవలం ప్రచారం మాత్రమే.
  • అందులో ఎలాంటి వాస్తవం లేదు, మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.
  • బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనేవి చాలా చిన్న విషయాలు.
  • వీటికి మించిన సమస్యలు ఇండస్ట్రీలో ఉన్నాయి.
  • అన్ని సమస్యల పరిష్కారానికి మేం ప్రయత్నం చేస్తున్నాం.
  • డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకారం అందిస్తాం.
  • మాకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఇచ్చారు.
  • తెలంగాణ బ్రాండ్‌ను పెంచాలి.
  • సినిమా పరిశ్రమగా దాన్ని మేము రీచ్ కావాలి.
  • తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి? అలాగే..
  • హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ హబ్ గా మార్చడానికి ఏం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెడుతున్నాం.
  • దీనికోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
  • దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు పరిశ్రమ తరపున సలహాలు, సూచనలు కోరారు.
  • ఈ అంశాలపై ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి మా అభిప్రాయాలను తెలిపేందుకు మరోసారి సీఎంను కలుస్తాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.