పుష్ప 2.. ఓవర్సీస్‌లో అదిరిపోయే రికార్డ్

Pushpa 2 Becomes Highest Grossing Film in 2024 at Australian Box Office

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో రీసెంట్‌గా మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 10 రోజుల్లో హిందీలో 507.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. తద్వారా అతి తక్కువ రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.

మరోవైపు ఓవర్సీస్‌లో సైతం పుష్ప 2 సాలిడ్ వసూళ్లు కళ్లజూస్తోంది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను సాధించింది. ఇప్పటివరకూ అక్కడ 4 మిలియన్ డాలర్స్‌కు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. తద్వారా ఈ ఏడాది ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రాకటించారు.

ఈ క్రమంలో పుష్ప 2 ఓవరాల్‌గా కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లో 1,409 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుని 1,500 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. సెకండ్ వీకెండ్ తరువాత ఈ సినిమా జోరుకి బ్రేక్ పడొచ్చేమో అనుకున్నారు కానీ అలాంటిదేం లేదని ఈ కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. వీక్ డేస్ లోనూ పుష్ప 2 భారీ వసూళ్లే అందుకుంటోంది. టోటల్ రన్ లో పుష్ప 2 మూవీ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.