హిట్ 3.. కాశ్మీర్‌లో యాక్షన్ మోడ్‌లో నాని

Natural Star Nani's HIT The 3rd Case Kashmir Schedule Commenced

నేచురల్ స్టార్ నాని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో మచ్ అవైటెడ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఇందులో ఆయన మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో వచ్చిన హిట్, హిట్ 2 సినిమాలకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నాని క్యారెక్టర్ ఇటీవలి గ్లింప్స్‌లో చూపించినట్లుగా ఫుల్ ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్‌గా ఉండనుంది. తన పాత్ర టఫ్, డైనమిక్ పర్సోనకి సరిపోయేలా నాని అద్భుతంగా మేక్ఓవర్‌ అయ్యారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ న్యూ షూటింగ్ షెడ్యూల్ కాశ్మీర్‌లో ప్రారంభమైంది. ఇక్కడ టీం ఇతర కీలక సన్నివేశాలతో పాటు నాని, ఫైటర్స్ టీంతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఇప్పటికే నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడమతో ప్రొడక్షన్ పనులు సజావుగా సాగుతున్నాయి.

కాగా ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. హిట్ 3 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే 1న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.