హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్నారు. అలాగే సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ చిత్ర విశేషాలు వివరించారు. నరేష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇది ఒక సక్సెస్ మీట్‌లా అనిపిస్తుంది. సినిమా అంటే పాషన్‌తో ఇంతమంది ఇక్కడికి వచ్చారు. డీవోపీ రిచర్డ్ ఈ సినిమాతో హైదరాబాదులో సెటిల్ అయిపోతారు. ఆయన లాంటి కెమెరామెన్ రావడం మా అదృష్టం. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్బమ్ నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. బిజీఎం కూడా వండర్‌ఫుల్‌గా ఇచ్చారు.”
“సుబ్బు కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. నాకోసం తను వెయిట్ చేశాడు. అయితే ఈ వెయిటింగ్ పిరియడ్‌ని కూడా చాలా అద్భుతంగా వాడుకున్నాడు. సినిమా కోసమే అహర్నిశలు కష్టపడ్డాడు. వేడుకకు వచ్చిన సంయుక్త, కిరణ్‌కి థాంక్యూ. క సినిమా నాకు చాలా నచ్చింది. సంయుక్త గారికి ఆల్ ద వెరీ బెస్ట్. అమృత చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. హనుమాన్ సక్సెస్‌తో ఇయర్‌ని స్టార్ట్ చేశారు. బచ్చల మల్లి సక్సెస్‌తో ఎండ్ చేయాలని కోరుకుంటున్నాను.”
“ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ. నిర్మాత రాజేష్ గారితో జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇది నాకు హోం బ్యానర్, అడిగిన ప్రతిదీ ఇచ్చారు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాను. సుబ్బు ఏదైతే చెప్పాడో అది తీశాడు. డిసెంబర్ 20న మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. ఒక్కటి మాత్రం చెబుతున్నాను. ఈ క్రిస్మస్ మనదే’ అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























