సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ‘UI ది మూవీ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్.కే.ఎన్ అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపేంద్ర గారికి నేను బిగ్ ఫ్యాన్ ని. ఆయన్ని చూడడానికి ఈ వేడుక వచ్చాను. ఉపేంద్ర, ఓం, ఏ.. ఈ సినిమాలన్నీ చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. మేము చదువుకునేటప్పుడు ఆయన పేరు చెప్తే అమ్మాయిలు భయపడేవారు, అబ్బాయిలు నవ్వేవారు అది ఆయన టాలెంట్ (నవ్వుతూ).” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఉపేంద్ర సినిమా చూసినప్పుడు వన్ మినిట్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది. ప్రొజెక్టర్ ఆగిపోయిందా అనే అనుమానం వచ్చి వెనక్కి చూస్తాం. కానీ అక్కడికి సినిమా స్టార్ట్ చేసి మళ్లీ కథ చెప్పడం మొదలు పెడతారు. ఇలాంటి ప్రయోగాలు ఉపేంద్ర గారు ఎన్నో చేశారు. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఏదో ఉంటుందని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























