పుష్ప 2.. 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Pushpa 2 The Rule Worldwide Box Office Collection of 11 Days

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో పుష్ప 2 ఓవరాల్‌గా కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లో 1,409 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సెకండ్ వీకెండ్ తరువాత ఈ సినిమా జోరుకి బ్రేక్ పడొచ్చేమో అనుకున్నారు కానీ అలాంటిదేం లేదని కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. వీక్ డేస్ లోనూ పుష్ప 2 భారీ వసూళ్లే అందుకుంటోంది.

ఇది ఇలాగే కొనసాగితే, త్వరలోనే ‘బాహుబలి-2’ సినిమా కలెక్షన్స్‌ను దాటేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా బాహుబలి-2 1,800 కోట్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం 2,000 కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. టోటల్ రన్ లో పుష్ప 2 మూవీ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.