సంక్రాంతికి వస్తున్నాం.. గోదారి గట్టు సాంగ్ ప్రోమో రిలీజ్

Sankranthiki Vasthunam Godari Gattu Song Promo Out

విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే ప్రస్తుతం హీరో వెంకటేష్‌, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలసి డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో ‘గోదారి గట్టు’ అనే ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను నేడు రిలీజ్ చేశారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల గాత్రం అందిస్తున్నారు. కాగా ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. ఈ పాట వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. ఆకాశంలో పౌర్ణమి, అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య మాంచి రొమాంటిక్ సొంగ్‌గా దీనిని చిత్రీకరించారు.

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చే జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్ కాగా, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.