తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడని ఇంతకుముందే వార్తలు రాగ ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా సినిమా రానుంది.నిన్న మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందించనుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.సో బడ్జెట్ కు డోకా ఉండదు.తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సందీప్ కిషన్ తెలుగు తోపాటు తమిళ సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ బ్లాక్ బాస్టర్ ధనుష్ రాయణ్ లో కీలకమైన పాత్రలో నటించాడు.సందీప్ ఇంతకుముందు మానగరం తో లోకేష్ కనగరాజ్ ను డైరెక్టర్ గా పరిచయం చేశాడు ప్రస్తుతం అతను కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పుడు జాసన్ సంజయ్ ను పరిచయం చేయనున్నాడు.మరి తొలి సినిమాతో సంజయ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఇక ఈసినిమా గురించి సందీప్ కిషన్ స్పందించాడు రాయన్ రిలీజ్ కు ముందు నేను & జాసన్ కలిసి వర్క్ చేయాలని అనుకున్నాం.తను బ్రేక్ లేకుండా 50నిమిషాల నరేషన్ ఇచ్చాడు.నేను షాక్ అయ్యా.స్క్రిప్ట్ మీద తను పెట్టిన కష్టానికి.ఈసినిమా ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.తన డ్రీం ప్రాజెక్ట్ ని నేను సపోర్ట్ చేయడం హ్యాపీగా వుంది.వచ్చే ఏడాది జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సందీప్ రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
మరో వైపు విజయ్ తన చివరి సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు.హెచ్ వినోత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























