ఓటీటీ ప్రియులకు శుభవార్త. ఈవారం రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేశాయి. అయితే అవి రెండూ సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం. టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మరియు మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వీటిలో ఒకటి 50 కోట్ల క్లబ్ లోకి, మరొకటి 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాయి. ఇక ఈ రెండూ కూడా ఆయా హీరోల కెరీర్‌లో తొలి బెంచ్ మార్క్ మూవీలుగా నిలవడం గమనార్హం. కిరణ్ అబ్బవరం ‘క’ ఈటీవీ విన్ ఓటీటీ లోకి రాగా, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ రెండు సినిమాలు నేటినుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుత నటనను ప్రదర్శించారు. 1980 లలో సెట్ చేయబడిన ఈ పీరియడ్ క్రైమ్ డ్రామా ఒక సాధారణ బ్యాంకర్ అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని కళ్ళకు కట్టింది.
అప్పులు, అవమానాలతో పోరాడుతూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్న దిగువ మధ్యతరగతి వ్యక్తి.. వీటి నుండి తప్పించుకోవడానికి భాస్కర్ ఆర్థిక మోసాల ప్రమాదకరమైన ప్రపంచంలోకి మునిగిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందనేదే సినిమా. థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత, ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ప్రీమియర్ అవుతోంది. తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులోవుంది.
క
కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. దర్శకద్వయం సుజీత్, సందీప్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలుగా నటించారు. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్‌కి సరికొత్త అనుభూతిని పంచింది.
ఇతరుల ఉత్తరాలు చదివే అభినయ వాసుదేవ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో ఒక రిమోట్ ఏరియాలో జరిగే వుమెన్ ట్రాఫికింగ్ను గుర్తించి చిక్కుల్లో పడతాడు. దీని కారణంగా అతను హై-సెక్యూరిటీ ఇంటరాగేషన్ సెల్‌లో బంధించబడతాడు. ఒక ముసుగు వ్యక్తి అతని జీవితంలోని రహస్యాలను తెలుసుకునేందుకు హిప్నోటైజింగ్ గాడ్జెట్‌ను ఉపయోగిస్తాడు.
అక్కడినుంచి అభినయ్ ఎలా తప్పించుకున్నాడు? తనతోపాటు పట్టుబడి ఉన్న మరో అమ్మాయి ఎవరు? ఆ ప్రాంతంలో తను ఏం కనిపెట్టాడు? చివరకు ఏం తెలుసుకున్నాడు? అనేది మిగతా కథ. కాగా ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ లలో ఒకటిగా ఈ మూవీ క్లైమాక్స్ ఉందని విమర్శకులచే ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























