రాజు మళ్లీ రంగంలోకి దిగాడు. అలాగే షారుఖ్ ఖాన్ తన ప్రయాణాన్ని కూడా ప్రేక్షకులకు కనిపించేలా చేయబోతున్నారు! ఈ ఏడాది అతిపెద్దదైన, ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదాత్మక, కుటుంబ కథా చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తన అద్భుతమైన వాయిస్ కాస్ట్‌తో అభిమానులను అలరించనుంది. కాగా 2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్‌గా వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయులు ఆర్యన్ ఖాన్ మరియు అబ్రమ్ ఖాన్ లతో కలిసి డబ్బింగ్ చెప్పారు. అడవి రాజుగా ముఫాసా ఎదుగుతున్న స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరిస్తూ, ముఫాసా కోసం గళం విప్పుతున్న షారుఖ్ ఖాన్ ఈ ఐకానిక్ పాత్రతో తనకున్న గాఢమైన అనుబంధాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు. “కాఫీ మిల్తీ జుల్తీ హై నా యే కహానీ” అంటూ ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి విడుదలైన కొత్త వీడియోలో ముఫాసా ప్రయాణంతో తన జీవన యాత్రను పోలుస్తూ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో, షారుఖ్ ఖాన్ ముఫాసా కథను వివరించారు, ఇది కష్టం, పట్టుదల, విజయం యొక్క కథ, భారతదేశంలో అత్యంత ప్రియమైన సూపర్ స్టార్లలో ఒకరిగా మారడానికి షారూక్ చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది ప్రతిధ్వనిస్తుంది. ముఫాసా సవాళ్లను అధిగమించి నాయకుడిగా తన సముచిత స్థానాన్ని సంపాదించుకున్నట్లే, షారుఖ్ ఖాన్ కృషి మరియు సంకల్పం భారతీయ సినిమా యొక్క నిజమైన బాద్ షాగా అతని వారసత్వాన్ని సుస్థిరం చేసింది.
“ముఫాసా: ది లయన్ కింగ్” కథలో ప్రైడ్ లాండ్స్ యొక్క ప్రియమైన రాజు అనూహ్యంగా ఎలా రాజుగా ఎదిగాడో చెబుతుంది. రఫికి, ఈ కథను పునరావృతం చేస్తూ, అనాథ శిశువైన ముఫాసాను, రాజకుటుంబ వారసుడైన సానుభూతి గల సింహం టాకాను పరిచయం చేస్తాడు. ఈ ఇద్దరితో పాటు భిన్నమైన మరియు అద్భుతమైన మిత్రగుంపుతో వారి విశాలమైన ప్రయాణాన్ని చూపిస్తుంది.
ఇక ఈ చిత్రానికి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆయనతో పాటు ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం పుంబా పాత్రకు, అలీ టిమోన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. డిస్నీవారి ముఫాసా: ది లయన్ కింగ్ 2024 డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఈ కొత్త చిత్రానికి బారీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: