మెకానిక్ రాకీ.. నాకు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్

Actress Shraddha Srinath Reveals Interesting Facts About Mechanic Rocky

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కథలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?

  • నేను ఒక ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాను. ప్రతి రెండేళ్ళకోసారి స్టేట్ షిఫ్ట్ అవుతుంటాము.
  • సహజంగానే నాకు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇష్టం.
  • మెకానిక్ రాకీలో నాది డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్ చేశాను.
  • ఇది నాకు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. ఒక ఛాలెంజ్ తీసుకొని చేశాను.
  • మాయ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.
  • అలాగే విశ్వక్‌తో కలసి నటించడం చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది.

మీ పాత్ర ఎలా వుండబోతోంది?

  • కథలో నా క్యారెక్టర్ కాంట్రీబ్యూషన్ చాలా క్రూషియల్‌గా ఉంటుంది.
  • మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
  • ఆడియన్స్‌కి చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు వుంటాయి. చాలా విజల్ మూమెంట్స్ వుంటాయి.
  • డైరెక్టర్ రవితేజ చాలా అద్భుతంగా తీశారు.

మీనాక్షితో మీకు కాంబినేషన్ సీన్స్ వున్నాయి?

  • మాకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా లేవు కానీ సెట్స్‌లో చాలా సార్లు కలిశాం.
  • తనది కూడా ఆర్మీ కుటుంబమే. మాకు చాలా సిమిలారిటీస్ వున్నాయి.

గతంలో మీరు విశ్వక్ చెప్పిన ఓ కథని రిజెక్ట్ చేశారని విన్నాం?

  • అది ఓ రీమేక్. నిజానికి నాకు రిమేక్ సినిమాలు చేయడం అంత ఇష్టం వుంది.
  • అందుకే ఆ సినిమా చేయడం కుదరలేదు.
  • ఫైనల్‌గా మెకానిక్ రాకీలో విశ్వక్‌తో కలసి పని చేయడం చాలా ఎక్సయిటెడ్‌గా అనిపించింది.
  • విశ్వక్ ఆన్ స్క్రీన్ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం.
  • ఆఫ్ స్క్రీన్ తను చాలా సరదాగా వుంటారు.
  • ఆయనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో వర్క్ చేయడం గురించి?

  • చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని తీశారు.
  • టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్ వుంటుంది.
  • జేక్స్ బిజోయ్ అద్భుతమై మ్యూజిక్ ఇచ్చారు.

మీ తొమ్మిదేళ్ళ సినీ జర్నీ ఎలా అనిపిస్తోంది?

  • నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు.
  • ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్‌గా తీసుకొని ముందుకు వెళుతున్నాను.
  • ఈ జర్నీలో హైస్ అండ్ లోస్ వున్నాయి. జెర్సీ తర్వాత పీక్స్ చూశాను.
  • కోవిడ్ లో సినిమాలు ఆగినప్పుడు అందరిలానే నేనూ భయపడ్డాను.
  • నా సినీ జర్నీ జీవితంలానే అలా ముందుకు సాగుతోంది.
  • హిట్స్, ఫ్లాప్స్‌ని ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను.
  • నాకు క్యాలిటీ వర్క్స్ చేయడం ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్‌గా వుంటాను.

మీ కథ ఎంపిక ఎలా ఉంటుంది?

  • కథ వచ్చినపుడు అది హిట్టా అవుతుందా లేదా అనేది మన చేతిలో వుండదు.
  • పేపర్ మీద అది ఎంత స్ట్రాంగ్‌గా వుందో చూసుకుంటాను.
  • అలాగే నా క్యారెక్టర్‌కి వున్న ప్రాధాన్యత చూస్తాను.
  • ఒక ఆడియన్‌గా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో.. అలాంటి కథలు చేయడానికి ఇష్టపడతాను.

రివ్యూస్, క్రిటిసిజంను ఎలా తీసుకుంటారు?

  • ఫిలిం క్రిటిసిజంను అంత సీరియస్‌గా తీసుకోను.
  • సినిమా గురించి ఎవరైనా ఒపీనియన్ చెప్పొచ్చు.
  • ఒక ఆడియన్‌గా నాకూ ఒక ఒపీనియన్ వుంటుంది.
  • అయితే పర్సనల్ ఎటాక్ మాత్రం కాస్త హర్టింగ్‌గా అనిపిస్తుంది.

మీకు ఇష్టమైన జోనర్ ఏమిటి?

  • చూడటాని హారర్ జోనర్ ఇష్టం.
  • ‘కల్కి’ లాంటి సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించడానికి ఇష్టపడతాను.
  • అలాగే బాహుబలి లాంటి పిరియడ్ సినిమాలో పార్ట్ అవ్వాలని వుంటుంది.
  • అలాగే కామెడీ సినిమాల్లో కూడా చేయాలని వుంది.
  • మెకానిక్ రాకీ తర్వాత నాకు ఇంకా డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నాను.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్?

  • డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తోంది.
  • తమిళ్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.
  • విష్ణు విశాల్‌తో ఓ సినిమా చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.