మెకానిక్ రాకీ సెన్సార్ కంప్లీట్

Mechanic Rocky completes censor formalities

మరో నాలుగు రోజుల్లో మెకానిక్ రాకీ తో రానున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఈఏడాది తనకు ఇది థర్డ్ రిలీజ్.ఇంతకుముందు గామి ,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాగ ఇందులో గామి హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు మెకానిక్ రాకీ తో వస్తున్నాడు.అందులో భాగంగా ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమా యు/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ ను వదలనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఇక ఈ సినిమా విజయంపై విశ్వక్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.పక్కగా హిట్ అవుతుందని అంటున్నాడు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈసినిమాను తెరకెక్కించగా మీనాక్షి చౌదరీ ,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.జేక్స్ బేజాయ్ సంగీతం అందించాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ తాళ్లూరి నిర్మించాడు.

ఇక విశ్వక్ సేన్ ప్రస్తుతం లైలా అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.