మెకానిక్ రాకీ.. 5 నిమిషాలు కూడా బోర్ కొట్టదు

Vishwak Sen Reveals Interesting Facts About Mechanic Rocky

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో వరంగల్‌లో ‘మెకానిక్ రాకీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చిత్ర విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వక్ సేన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థాంక్యూ సో మచ్. మేము చాలా కష్టపడి సినిమా చేస్తున్నాము. ఎంతో హార్డ్ వర్క్ చేసి మా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాము.”

“క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన ఏం కామెంట్ చేసినా పర్వాలేదు. కానీ పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయకూడదని కోరుతున్నాను. క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ అప్ స్పీచ్ మాకు ఉంది. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు.”

“మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుతున్నాను. మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూశాను. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిన మళ్లీ సినిమా తీస్తాను. మాకు తెలిసిందంట ఒకటే సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులు, ప్రేక్షకులే. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.”

“డైరెక్టర్ రవితేజ తెలుగులో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. మీనాక్షి, శ్రద్ధ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా నిర్మాత రామ్ గారు నాకు పెద్ద సపోర్ట్ సిస్టం. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంపాజిబుల్. తప్పకుండా ఆయన కాలర్ ఎగరేసుకునేలా చేస్తా. చాలా మంచి సినిమా తీశాం. నవంబర్ 21న పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. 21 న పెయిడ్ ప్రీమియర్ కి రండి.”

“నేను చేసిన పది సినిమాల ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను. ఇది చాలా మంచి సినిమా. ఒక ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. సినిమా చూడండి. మీరు బాగుందని చెప్తే 22 నుంచి మిగతా ఆడియన్స్ చూస్తారు. మనోజ్ అదిరిపోయే విజువల్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ జోక్స్ బిజోయ్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో సక్సెస్ మీట్ తో ఎండ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెంట్ కి వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. జైహింద్” అని అన్నారు హీరో విశ్వక్ సేన్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.