ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. ఈ నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్.
బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగడం విశేషం. బీహార్ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఇదే ప్రథమం.
ఇక ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, నిర్మాతలు రవిశంకర్, నవీన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను పుష్ప శ్రీవల్లి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను” అని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: