మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్‌గా కొత్త రికార్డు సృష్టించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ హాజరు కావడం జరిగింది. సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగటం విశేషం. అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, నిర్మాతలు రవిశంకర్, నవీన్ తదితరులు హాజరయ్యారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































