కన్నడ స్టార్ రిషభ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్ 1’. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. రిషభ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2025 అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇండియాలో దసరా బిగ్గెస్ట్ సీజన్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రిషభ్ శెట్టి ఫెరోషియస్ అవతార్ లో కనిపించారు. ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో గొడ్డలి పట్టుకొని లెజెండ్‌గా కనిపించిన పోస్టర్ అదిరిపోయింది.
కాగా హోంబలే ఫిల్మ్స్ హై-క్యాలిబర్, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన మూవీస్ అందించాలనే విజన్ తో సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ హోంబాలే ఫిల్మ్స్ లో వచ్చిన కాంతార వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది.
రిషభ్ శెట్టి ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఇక నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో కాంతార: చాప్టర్ 1 చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. కేరళ నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్ కఠినమైన శిక్షణ పొందారు.
కాంతార కొంకణ్ జానపద గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. గ్రిప్పింగ్ నేరేషన్, బ్రెత్ టేకింగ్ విజువల్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించింది. కాగా ఈ ఫ్రాంచైజీకి గ్లోబల్ ఫ్యాన్ బేస్ వుంది. హోంబలే విజన్, రిషబ్ శెట్టి అంకితభావం, మొదటి చాప్టర్ లెగసీతో ఈ చిత్రం మరో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: