పుష్ప 2 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన పుష్పరాజ్

Pushpa 2 The Rule Trailer Released, Allu Arjun Mesmerized with His Acting

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్‌’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. దాదాపు 12,000 స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

వారి నిరీక్షణకు తెరదించుతూ ఈరోజు బీహార్‌లోని పట్నా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసారు మేకర్స్. అందరూ ఊహించినట్టుగానే ట్రైలర్ అయితే అదిరిపోయింది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్లో గ్రేస్.. ఇలా ప్రతి ఒక్కటీ అమేజింగ్.

ప్రత్యేకించి పుష్పరాజ్ నడకలోని స్వాగ్ ఓ రేంజ్‌లో హై ఇచ్చింది. ట్రైలర్ చివరిలో ‘తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ మరోసారి పుష్ప పార్ట్ 1ని గుర్తుకు తెచ్చింది. ఇక రష్మిక మరోసారి తన అందంతో కట్టిపడేసింది. అలాగే ఫహద్ ఫాసిల్ క్యారక్టర్ చాలా ఇంటెన్స్‌గా సాగింది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను స్కై లెవెల్‌కి తీసుకెళ్లింది చెప్పొచ్చు.

కాగా ఈ చిత్రం షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది యూనిట్. మరోవైపు రష్మిక మందన్నా తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే హీరో అల్లు అర్జున్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలపై స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. పాట నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.