యూఎస్ఏలో పుష్ప రీ రిలీజ్‌.. థియేటర్స్ లిస్ట్ ఇదే!

Pushpa The Rise Ready For Re Release in USA, Here's The Theatres List

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప 2: ది రూల్‌’. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. దాదాపు 12,000 స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్‌ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందని ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌ భావిస్తున్నాయి.

అయితే ఇదిలావుంటే, మరోవైపు పుష్ప: ది రూల్ (పార్ట్ 1) సినిమా యూఎస్ఏలో రీ రిలీజ్‌ కానుండటం గమనార్హం. నవంబర్ 19వ తేదీన అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా రీ రిలీజ్ అవుతోంది. కాగా ఆ ఒక్క రోజే ఈ మూవీ స్క్రీనింగ్ జరుపుకోనుంది. ఇక ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో పుష్ప సినిమా ప్రదర్శించబడనున్న థియేటర్ల లిస్టును సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ దీనిని అక్కడ విడుదల చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.