యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్‍గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో జరిగిన ఎమోషన్స్, ఇన్సిడెన్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఫిక్షనల్ స్టొరీ కంటే థ్రిల్లింగ్‌గా వుండబోతున్నాయి. ఇక తండేల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన చైతూ ఫస్ట్ లుక్, సాయి పల్లవిని ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన సత్య మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో తండేల్ నుంచి ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘బుజ్జి తల్లి’ అంటూ సాగే ఈ డ్యూయెట్ సాంగ్ ఈ నవంబర్‌లోనే విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం తెలిపింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: