NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్

NBK109 Title Announced and Teaser Released

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘NBK109’ (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. దీంతో టైటిల్‌తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా ఈ మూవీకి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా పవర్ ఫుల్‌గా ఉంది టైటిల్. కాగా బాలయ్య ఇందులో బందిపోటు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అందుకే దీనిని సూచించేలా ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సందర్భంగా డాకు మహారాజ్ టీజర్ కూడా విడుద చేసింది చిత్ర బృందం. అయితే ఇప్పటివరకూ బాలయ్య బాబు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా? డైరెక్టర్ బాబీ ఆయనను ఎలా ప్రజెంట్ చేస్తాడా? అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు, ఊహలకు ఏమాత్రం తగ్గకుండా బాలకృష్ణను పవర్ ఫుల్ రోల్‌లో చూపించాడు బాబీ. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.