టాలీవుడ్ యంగ్ హీరో, మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన మేనమామ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలుసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మేనల్లుడు ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న శుభ తరుణంలో పవన్ కళ్యాణ్ సాయి తేజ్‌కు శుభాభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం” అనిపేర్కొన్నారు.
అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “నేను టాలీవుడ్ లోకి ఎంటరై అప్పుడే డికేడ్ గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. ఈ సందర్భంగా చిన్నమావయ్య ఆశీర్వాదం పొందటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. చిన్నతనం నుంచి నాకు కళ్యాణ్ మావయ్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. నా కెరీర్‌కు ఆయన మార్గదర్శిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు నడిపిస్తోంది” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: