100 కోట్ల క్లబ్ లోకి లక్కీ భాస్కర్

Lucky Baskhar 14 Days Box Office Collections

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి తెలుగు సినిమా బాగా కలిసొచ్చినట్టే కనిపిస్తుంది. అపజయం అన్నదే లేకుండా హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ‘మహానటి’, ఆ తరువాత ‘సీతారామం’ రెండూ ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక మధ్యలో గెస్ట్ పాత్రలో మెరిసిన ‘కల్కి 2898 AD’ కూడా బ్లాక్ బస్టరే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హీరోగా నటించిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు వారాలు గడుస్తున్నా ఈ సినిమా ఎక్స్‌లెంట్ రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా విడుదలైన అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ప్రాఫిట్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ అరుదైన రికార్డ్ సాధించింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. లక్కీ భాస్కర్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 14 రోజుల్లో మోత 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో మలయాళ హీరో అయినా దుల్కర్ తెలుగులో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన హీరోగా రికార్డ్ సృష్టించాడు.

కాగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ కోలీవుడ్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఇదిలావుంటే, దుల్కర్ ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ అనే మరో సినిమా చేస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.