ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2 ది రూల్’. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా మొత్తం 12 వేల స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పుష్ప 2పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. మరోవైపు ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో.. పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్ తదితర నగరాలలో నిర్వహించబోతున్నారు.
ఈ నేపథ్యంలో పుష్ప 2పై భారతదేశంలోని సినీ ప్రేమికులు, ఐకాన్ స్టార్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికోసమా అన్నట్టు ఈ మూవీలో కథానాయికగా నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా పుష్ప 2కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె ఈ సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు, రేపటిలో తన పార్ట్ డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేయనుంది.
ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో ఇలా తెలిపింది.. “పుష్ప 2 షూటింగ్ దాదాపు పూర్తయింది. ఫస్టాఫ్ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక సెకండాఫ్ డబ్బింగ్ మొదలయింది. ఓ మై గాడ్, ఫస్టాఫ్ అయితే అదిరిపోయింది.. సెకండాఫ్ కూడా అంతకుమించి ఉండనుంది. ఇది చూసి నాకు మాటలు రావడం లేదు. రేపు మీకు కూడా థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.” అని తెలిపింది.
అలాగే ఇంకా ఈ విధంగా చెప్పింది.. “ఇక ఈ సినిమాను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నా. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. అందుకే నాకు చాలా బాధగా ఉంది. అప్పుడే పుష్ప 2 చిత్రీకరణ పూర్తయిందా అనిపిస్తుంది. అందుకే నా ముఖం ఇలా ఉంది” అని పేర్కొంటూ డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఫేస్ డల్‌గా పెట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది రష్మిక. ఇక రష్మిక ఇచ్చిన ఈ వరుస అప్‌డేట్స్ చూసి బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























