టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా కన్నడ స్టార్ డాలీ ధనంజయ మాట్లాడుతూ.. “స్నేహజీవి చిరంజీవి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చాను. అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు వచ్చాను. ఏదైనా ఒక వైఫల్యం వచ్చినప్పుడు స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తి కావాలి. ఎవరి ప్రయాణమైనా మనల్ని మనకు స్ఫూర్తినివ్వాలి. నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన ప్రయాణం చిరంజీవి గారిది. చిరంజీవి గారు గ్రేట్ ఇన్స్పిరేషన్” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అలాంటి చిరంజీవి గారిని ఈ వేడుకలో కలవడం చాలా ఆనందంగా ఉంది. వాల్తేరు వీరయ్యలో బాబీ చేసిన క్యారెక్టర్ ని నేను చేయాల్సింది. కానీ మిస్ అయ్యాను. ఈ ప్రాజెక్టుకి నన్ను రిఫర్ చేసిన మై బ్రదర్ సత్యదేవ్ కి థాంక్యూ. కన్నడలో నీకు శివన్న ఎలాగో.. తెలుగులో నాకు చిరంజీవి గారు అలా.. అని సత్య నాకు చాలా సార్లు చెప్పాడు. ప్రతిభని ఇంత అద్భుతంగా ప్రోత్సహిస్తున్న చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అని చెప్పారు.
అలాగే టాలీవుడ్‌లో అవకాశాల గురించి మాట్లాడుతూ.. “డైరెక్టర్ ప్రశాంత్ గావర్మ రికి థాంక్యూ. ఆయన హనుమాన్ సినిమా ఎంతగానో నచ్చింది. ఆయన నుంచి అద్భుతమైన సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. జీబ్రా కంప్లీట్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్, డెఫినెట్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. మా నిర్మాతలు అందరికీ థాంక్యూ. పుష్ప తర్వాత నన్ను మన జాలి రెడ్డి అంటున్నారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. మరిన్ని ప్రొజెక్ట్స్ ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు హీరో డాలీ ధనుంజయ.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: